Site icon NTV Telugu

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్లో చోటు దక్కేదెవరికి..?

Tg

Tg

Telangana Cabinet Expansion: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి విస్తరణ కు సమయం ఆసన్నమైంది. జులై మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మూడు రోజులుగా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పటికే హస్తినలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు సైతం ఉన్నారు. అయితే, కేబినెట్ లో ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం 11 మందికి మంత్రి పదవులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. త్వరలోనే మిగతా ఆరు మంత్రి పదవులను కేటాయించే అవకాశం కనిపిస్తుంది.

Read Also: Viral Video: పార్లమెంట్‌లో కలిసిన హీరో హీరోయిన్లు.. వీడియో వైరల్

కాగా, మొత్తం 18 మందికి మంత్రి పదవులకు అవకాశం ఉంది. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అలాగే, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్ లో ఇంకా చోటు దక్కలేదు.. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రి పదవిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, కొత్త మంత్రివర్గంలోకి వచ్చేది ఎవరనే దానిపై రెండు మూడు రోజుల్లో ఓ క్లారిటీ రానుంది.

Exit mobile version