Site icon NTV Telugu

బీజేపీ నేతల జూమ్ మీటింగ్.. కృష్ణా నీటి పంపకాలపై చర్చ

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా కృష్ణా నది జలాల విషయంలో మాటలు, లేఖల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జూమ్ మీటింగ్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ సమావేశంలో కృష్ణా నీటి పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలు, వివాదాలు, ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్ట్‌పై తదితర అంశాలపై ఫోకస్‌ పెట్టనున్నారు. ఇక, నీటి పంపకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిని తప్పుబడుతోన్న బీజేపీ.. ఈ వ్యవహారంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనుంది. అయితే, ఇవాళ సమావేశంలో అన్నీ చర్చించి.. రేపటి కార్యవర్గ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయనుంది బీజేపీ.. మరోవైపు.. కర్నూలు వేదికగా.. ఏపీ బీజేపీ నేతలను కూడా సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే.. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతోన్న వేళ బీజేపీ సమావేశాలు, తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

Exit mobile version