Site icon NTV Telugu

Ponnam Prabhakar : కుల గణనలో తెలంగాణకు జాతీయ స్థాయి గుర్తింపు

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar : కుల గణనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ అన్నారు. ఆదివారం మూసాపేటలోని మెజెస్టిక్‌ గార్డెన్స్‌లో జరిగిన మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోకాపేటలో మున్నూరు కాపు భవనం నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, చట్టబద్ధ మార్గంలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బలహీన వర్గాలన్నీ ఐక్యంగా పోరాడితేనే తమ హక్కులు సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మున్నూరు కాపు, కాపుల వర్గం నుండి ఏకగ్రీవ మద్దతు లభించిందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Iran Nuclear Program: ట్రంప్‌కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’

Exit mobile version