Telangana Assembly: నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలిపింది. అనంతరం గడ్డం ప్రశాద్ మాట్లాడుతూ.. ఎవరు ఎవరికి కించపరిచినట్లు మాట్లాడకూడదని విజ్ఞప్తి చేశారు. శాసన సభలో అందరూ ఒకరినినొకరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలని కోరారు. సభను మరింత హుందాగా నడపాలని కోరారు. మూడో శాసన సభ లో 57 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు.. రన్నింగ్ కామెంట్స్ చేయకండి అన్నారు. అనుభవజ్ఞులైన సభ్యులు .. కొత్త వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. శాసన సభలో అందరూ మాట్లాడే మాటలు ప్రజలందరికి ఆదర్శప్రాయంగా కావాలని కోరారు. అనంతరం ముందుగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడాలని స్పీకర్ కోరారు. నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Read also: Samantha : సమంత ఒక్క సారి అలా చేస్తే కోటి రూపాయలు ఇస్తారట.. ఇలా సంపాదిస్తున్నావా తల్లి నువ్వు
సభ ప్రారంభం కాగానే స్పీకర్ శాసనసభా పక్షాల నేతలను ప్రకటించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్‌ను, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావును ప్రకటించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనమండలి సంతాపం తెలిపింది. నాలుగు రోజుల విరామం తర్వాత నేడు శాసనసభ తిరిగి సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాసరెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలియజేస్తుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైనా, శ్వేతపత్రంపైనా శాసనసభలో లఘు చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.