Site icon NTV Telugu

తుఫాన్‌ ఎఫెక్ట్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా

assembly

assembly

గులాబ్‌ తుఫాన్‌ తెలంగాణలో విధ్వంసమే సృష్టిస్తోంది… ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుగా ప్రకటించారు సీఎం కేసీఆర్.. ఇక, అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.. భారీ వర్షాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా శాసనసభ, శాసన మండలి కార్యాలయాలు ప్రకటించారు.. వర్షాలు, వరదల సమయంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజక వర్గాలకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలని.. సహాయక చర్యల్లో పాల్గొనాలని బులిటెన్‌లో పేర్కొన్నారు.. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు శాసనసభ, శాసన మండలి బిజినెస్‌ జరగదు.. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Exit mobile version