ఏడు రోజులు.. ఆరు బిల్లులు, 32.05 గంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఏడు రోజుల పాటు జరిగాయి. మొత్తం అరు బిల్లులకు సభ ఆమోదం తెలపగా… ఆరు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తం 32 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. ఆఖరి రోజు సభలో సంక్షేమ పధకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వాలని కోరారు భట్టి. ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ అర్హులకు అందడం లేదని అన్నారు. కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ లు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక గాని రావడం లేదనీ విమర్శించింది బీజేపీ. అయితే దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్… ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులు… రాష్ట్రంలో సంక్షేమ పధకాలపై సుదీర్ఘంగా మాట్లాడారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై కామెంట్ చేశారు. కేంద్రం దగ్గరే డబ్బుల్లేవ్… ఇక మనకేమిస్తారని అన్నారాయన. మరోవైపు ఏడాది లోపు వక్ఫ్ భూముల విచారణ ముగిస్తామని హామీఇచ్చారు సీఎం. కేసీఆర్ సుదీర్ఘ వివరణ అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది. ఇక, యాదాద్రి టెంపుల్ నవంబర్ లేదంటే డిసెంబర్ లో ప్రారంభిస్తామని.. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా పిలిచామని.. వస్తామన్నారని తెలిపారు.. మరోవైపు.. మేం ఒక్క ఏడాదిలో పెట్టిన మైనార్టీ బడ్జెట్ …కాంగ్రెస్ పదేళ్లలో కూడా పెట్టలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా సంక్షేమం కోసం మేము కాంగ్రెస్ కంటే 10 రేట్లు ఎక్కువ పెట్టామన్నారు.. చెప్పిందే చెప్పి..చెప్పి.. అన్నట్టుగా చెప్ప దలుచుకోలేదన్న ఆయన.. వ్యవసాయం రాదు.. తెలివి లేదు అన్నా ఆంధ్ర పాలకుల గురించి చూద్దాం.. సగటు ఆదాయం ఏపీకి లక్షా 72 వేలు అయితే, తెలంగాణది 2 లక్షల 32 వేలుగా వివరించారు.. అయితే, కేంద్రం నుండి పెద్దగా వచ్చింది ఏమీ లేదన్నారు.. కేంద్రం అధికారంలోకి వచ్చినప్పుడు 50 వేల కోట్లు అప్పు.. ఇప్పుడు లక్ష కోట్లు దాటిందని గుర్తిచేశారు.. కేంద్రం నిధులు అనే ముచ్చట బంద్ చేయాలని బీజేపీ నేతలకు సూచించారు.. అది మీకే నష్టం అన్నారు సీఎం కేసీఆర్.. అయితే, చాలా అంశాలపై చర్చ జరగకుండానే సభ ముంగించారని ఆరోపించింది విపక్షం.
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
తాజావార్తలు
-
RR VS MI: ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
-
Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
-
Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
-
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!