NTV Telugu Site icon

Nagarkurnool: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. గువ్వల బాలరాజు నుదిటిపై గాయాలు..!

Guvvala Balaraju

Guvvala Balaraju

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణలో గువ్వల బాలరాజు నుదిటిపై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు వెంబడించారు. ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. టవెరా వాహనం అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ వంశీకృష్ణ ఆగ్రహించారు. ఈ ఘటన పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ కోరుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

అయితే కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణపైనే రాళ్లతో దాడి చేశారని గువ్వల బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. వంశీకృష్ణ స్వయంగా రాయి తీసి విసిరేయగా అది ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నుదుటిపై పడింది. దీంతో బాలరాజు కిందపడిపోయిన ఎమ్మెల్యేను మద్దతుదారులు ఆస్పత్రికి తరలించారు. తలపై బలమైన దెబ్బ తగలడంతో గువ్వల అపస్మారక స్థితికి చేరుకున్నారు. నుదిటిని తాకడం వల్ల పల్స్ పడిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఓటమి భయంతోనే గువ్వల బాలరాజుపై దాడికి పాల్పడ్డారని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కోట ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. ఇటీవల గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు వాపోయారు. అయితే ఈ దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.

Astrology: నవంబర్ 12, ఆదివారం దినఫలాలు