Site icon NTV Telugu

Telangana: నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బ‌డ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. 9న సాధార‌ణ బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రిగింది. అలాగే త‌ర్వాతి నాలుగు రోజుల్లో బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిగింది. మొత్తంగా 37 ప‌ద్దుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. ఈరోజు చివ‌రి రోజు కాబ‌ట్టి.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండ‌లిలో చర్చ జ‌ర‌గ‌నుంది.

ఈరోజు ద్రవ్య వినిమ‌య బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత‌.. ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ క‌మిటీల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల బిల్లుల‌పై మండ‌లిలో చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈరోజు ఉభ‌య స‌భ‌ల్లో ప్రశ్నోత్తరాల‌ను ర‌ద్దు చేశారు. కాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల చివరి రోజు కానున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. అసెంబ్లీలో ఆయన ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రతిపక్షాలకు కౌంటర్, బడ్జెట్ అంశాలపై ప్రస్తావించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో అసెంబ్లీకి ఆయన రాకపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Exit mobile version