Site icon NTV Telugu

Telangana Assembly: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. బడ్జెట్‌పై చర్చ

Telangana Assembly Session

Telangana Assembly Session

Telangana Assembly: నేడు(ఆరో రోజు) తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. సభను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రారంభించారు. తెలంగాణ శాసన సభలో జీరో అవర్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దని స్పీకర్ గడ్డం కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దని తెలిపారు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని అన్నారు. బీజేపీఎల్‌ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇవాల అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను ప్రభుత్వం సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీరాజ్ రిపోర్ట్‌లను టేబుల్ చేయనుంది. అసెంబ్లీలో పలు ప్రకటనలు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయనుంది. నిన్న ఈ అంశంపైనే బీఆర్‌ఎస్‌ ఆందోళన చేపట్టిందని అన్నారు. మీడియా పాయింట్‌ వద్దకు అనుమతించకపోవడంతో.. అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే..

Read also: European Union: రష్యాకు సహాయం చేసినందుకు భారత్, చైనీస్ సంస్థలపై ఈయూ ఆంక్షలు

నిన్న తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌ పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ శ్వేత ప్రతం ప్రవేశపెట్టారు. కాగా.. బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌ ను ప్రభుత్వం సీరియస్‌ తీసుకోవడం లేదని కడియం మండిపడ్డారు. బడ్జెట్‌ పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్‌ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్యలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరని అన్నారు. మంత్రులకు ఏమైనా డౌట్‌ ఉంటే బడ్జెట్‌ పుస్తకం చదువుకోవాలని తెలిపారు. బడ్జెట్‌ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలన్నారు. అందరి కోసం కాదు కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ.. మరో వైపు బయట తిగుతున్నారు అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అని ప్రశ్నించారు. మరోవైపు అసెంబ్లీలో అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చేశారు.
CPI Ramakrishna: ఎన్నికల కోసమే ఉమ్మడి రాజధాని డ్రామా..!

Exit mobile version