Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Agriculture Neglected In Union Budget 2026 Minister Thummala Criticism

Tummala Nageswara Rao : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం

Published Date :February 2, 2026 , 3:51 pm
By Gogikar Sai Krishna
  • రాష్ట్రానికి తీరని అన్యాయం
  • ఆయిల్ పామ్, పసుపు రైతులకు నిరాశ
  • ఎరువుల ధరల పెంపుతో అదనపు భారం
  • MSPపై చట్టబద్ధ హక్కు కల్పించలేదు
Tummala Nageswara Rao : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నిరాశ కలిగించింది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని వ్యవసాయ మంత్రి తుమ్మల తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని వలన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన బదులు, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును High Value Cropగా గుర్తించకపోవడం తెలంగాణ పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించింది. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న Dedicated Funds గురించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా, కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయమై కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతాంగానికి మరో ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే చర్యలు బడ్జెట్‌లో పూర్తిగా లేవని మంత్రి తెలిపారు.

రైతులకు అత్యంత కీలకమైన MSP (కనీస మద్దతు ధర)కు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైంది. దీని వలన రైతుల ఆదాయ భద్రతపై అనిశ్చితి మరింత పెరిగిందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్ లోని ప్రధాన లోపమని అన్నారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా తినుబండార నూనెలపై ఇంపోర్ట్ డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో తెలంగాణకు వచ్చే నిధుల్లో కోత విధించడం రాష్ట్రానికి తీరని అన్యాయం అని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమైందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు.

వ్యవసాయ రంగంలో బడ్జెట్‌లో ప్రస్తావించదగిన ఏకైక అంశం AI ఆధారిత కార్యక్రమాల ప్రస్తావన మాత్రమేనని, అయితే ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం AI రైతు సమస్యలకు పరిష్కారం కాదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మొత్తంగా, కేంద్ర బడ్జెట్–2026 తెలంగాణ రైతాంగానికి ఆశలు నింపడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రానికి ప్రత్యేకంగా యెటువంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా రూపొందించబడిందని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Car Launches: ఫిబ్రవరిలో కొత్త కార్ల దండయాత్ర.. MG మెజెస్టర్ నుంచి నిస్సాన్ టెక్టన్ రిలీజ్ అయ్యే టాప్-5 కార్స్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agriculture budget
  • MSP Issues
  • Oil Palm Farmers
  • Telangana Budget Reaction
  • telangana farmers

తాజావార్తలు

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

  • Smartphone Price Hike: మొబైల్ కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ఈ కంపెనీల ఫోన్ల ధరలు.. ఎంతంటే?

  • Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!

  • Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్‌లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions