NTV Telugu Site icon

Bandi Sanjay Press meet Live Updates: టీఆర్ఎస్ పార్టీలో ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారు

Bandi Sanjay

Bandi Sanjay

LIVE : Bandi Sanjay Press Meet l NTV Live

The liveblog has ended.
  • 10 Jul 2022 10:30 PM (IST)

    దమ్ముంటే ద్రౌపది ముర్మును ఓడించగలవా?

    సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ మానవ రూపంలో ఉన్న మృగం అని ఆరోపించారు. దమ్ముంటే ద్రౌపది ముర్మును కేసీఆర్ ఓడించగలడా అని ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎంగా ఉన్నారు.. ఆయన కుటుంబ పరిస్థితేంటి? కేసీఆర్ కుటుంబ పరిస్థితేంటో గమనించాలని బండి సంజయ్ కోరారు.

  • 10 Jul 2022 10:18 PM (IST)

    తెలంగాణలో పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించలేదు?

    కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ రేట్లు తగ్గించినా తెలంగాణలో ఎందుకు తగ్గించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచావని కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని సూటిగా అడిగారు.

  • 10 Jul 2022 10:06 PM (IST)

    నెట్టెంపాడు గురించి మాట్లాడాలి

    ఎక్కడో ప్రపంచంలోని నీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం గురించి కాదు.. నెట్టెంపాడు ప్రాజెక్టు గురించి కేసీఆర్ మాట్లాడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం స్థాయికి దిగజారి కేసీఆర్ మాట్లాడుతున్నాడని.. కేసీఆర్ మాటలకు మేం భయపడే వ్యక్తులం కాదని.. కేసీఆర్ ఎందుకో భయపడుతున్నాడని బండి సంజయ్ అన్నారు

  • 10 Jul 2022 09:59 PM (IST)

    టీఆర్ఎస్ పార్టీలోనే ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారు

    ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్‌ రెండున్నర గంటల పాటు ప్రెస్‌మీట్ పెట్టాడని బండి  సంజయ్ ఆరోపించారు. ఎప్పుడో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల గురించి వరదల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారు కాబట్టే కేసీఆర్ భయపడుతున్నాడని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

  • 10 Jul 2022 09:56 PM (IST)

    కేసీఆర్‌కు గజ్జి ఉందేమో?

    ఎవరూ గోకకపోయినా కేసీఆర్ గోకుతాడంట.. ఆయనకు గజ్జి ఉందేమో.. ఆయన పక్కన ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో రోజుకో హత్య, అత్యాచారం జరుగుతుంటే నిందితులను పట్టుకోవడం కేసీఆర్‌కు చేతకావడం లేదని ఆరోపించారు.

  • 10 Jul 2022 09:54 PM (IST)

    ప్రధానితో కేసీఆర్‌కు పోలికా?

    ప్రధాని మోదీతో కేసీఆర్‌కు పోలికేంటని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ 18 గంటలు పనిచేస్తున్నారని.. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పడుకుని అమావాస్యకు, పౌర్ణమికి బయటకు వస్తాడని బండి సంజయ్ చురకలు అంటించారు.

  • 10 Jul 2022 09:45 PM (IST)

    కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

    కేసీఆర్ దేవుళ్లను కించపరిచారు.. జోగులాంబ అమ్మవారిని అవమానించారు. ఆయన హిందూసమజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే కరీంనగర్ తరహాలో బొందపెడతామని హెచ్చరించారు.