TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. పేపర్ లీకేజీతో నిరుద్యోగుల జీతాలు ఆడుకుంటున్నారని బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తప్పు చేసినవాళ్లను వదిలిపెట్టి.. న్యాయం కోసం పోరాడుతున్నవాళ్లను అరెస్టు చేయడమేంటని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి కేసులో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ మరి కొందరిని 14 రోజుల రిమాండ్ విధించారు. ఆందోళన పాల్గొన్న ఏడుగురు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుం చంచల్ గూడ జైలులో బీజేవైఎం నేతలు ఉన్నారు.
Also Read:National No Selfies Day: నేడు ‘నో సెల్ఫీస్ డే’ పాటిస్తున్నారా?
ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ కు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య రానున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలు ఉన్న భాను ప్రకాష్ తో పాటు మరో 8మంది బీజేవైఎం కార్యకర్తలను ఆయన పరామర్శిస్తారు. చంచల్ గూడ జైలు లో ఉన్న బీజేవైఎం నేతలను ములాఖాత్ లో బీజేవైఎం నేత తేజస్వీ సూర్య కలవనున్నారు.
కాగా, ఈ నెల 14న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని TSPSC కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరు బీజేవైఎం నాయకులు ప్రధాన గేటు ఎక్కి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ బోర్డును తొలగించారు. ఆపై, కార్యాలయం ఆవరణలో బైఠాయించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.