ఇవాళ్టి నుండి టీచర్లు, సిబ్బంది స్కూళ్లకు రావాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లతో సహా… జూనియర్ కళాశాలలకు లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రావాలని కూడా పేర్కొంది. 3 నెలల తర్వాత పాఠశాలలకు టీచర్లు..కాలేజీలకు లెక్చరర్ లు తిరిని వస్తున్నారు. జులై ఒకటి నుండి ఆన్లైన్/ ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభం అవుతుండడంతో ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
read more :వైఎస్ వివేకా హత్య కేసు : ఇవాళ కీలక వ్యక్తులను విచారించనున్న సీబీఐ
విద్యా సంస్థల్లో క్లీనింగ్, విద్యార్థులతో కాంటాక్ట్, విద్యార్థుల నమోదు, పాఠశాలల నిర్వహణకు చేయాల్సిన పనులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. కెజిబివి మోడల్ స్కూల్స్ స్టాఫ్ కూడా హాజరు కావాలని విద్యాశాఖ వెల్లడించింది. అలాగే.. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచనలు చేసింది. కాగా.. కరోనా నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలతో సహా… అన్ని రకాల బోర్టు పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే.
