NTV Telugu Site icon

Teacher Transfers: నేటి నుంచే టీచర్ల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ కూడా..

Teacher Trafor

Teacher Trafor

Teacher Transfers: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ నేటి నుంచి ప్రారంభించనుంది. మల్టీజోన్-1లో ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్-2లో నేటి నుంచి ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వేర్వేరు షెడ్యూల్‌లను విడుదల చేశారు. కోర్టు కేసుల కారణంగా ఇంతకుముందు ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్లీ ప్రక్రియ కొనసాగుతుంది.

టెట్‌తో సంబంధం లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తారు. మూడేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈసారి 12,472 మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరగనుండగా, మరో 18,495 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది. కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం అనుమతించింది. మొత్తంగా ఈ ప్రక్రియ 23 రోజుల్లో పూర్తవుతుంది.

Read also: Fish Prasad: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ..

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇలా..

* మల్టీజోన్-2లో హెచ్‌ఎం, మల్టీజోన్-1లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* మల్టీజోన్-1లో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో, మల్టీజోన్-2లో ప్రభుత్వ పాఠశాలల్లో పదోన్నతులు కల్పించనున్నారు. ఇలా 1,250 మందికి పదోన్నతి లభిస్తుంది.
* 8,630 గ్రేడ్-II భాషావేత్తలు స్కూల్ అసిస్టెంట్ (భాషలు)గా పదోన్నతి పొందుతారు. మరో 1,849 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు.
* ఇంటర్మీడియట్, డీడీ పూర్తి చేసిన వారికి ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పదోన్నతి లభిస్తుంది.
* 2023లో బదిలీ ఉత్తర్వులు పొందిన వారికి రిలీవ్ కాలేదు. ఆ సమయంలో వారిని అదే స్థానంలో కొనసాగించాలని ఆదేశించారు. ఇటీవల పాత స్థానంలో పనిచేస్తున్న వారిని రిలీవ్ చేస్తూ బదిలీ చేసిన స్థలానికి ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Loksabha Elections 2024 : ఉత్తరప్రదేశ్‌లో ఇళ్లను వదలని ఓటర్లు.. 72స్థానాలపై తీవ్ర ప్రభావం

ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి..

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. STUTS రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్‌లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. భాషాభిమానుల పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలపై ఆర్‌యూపీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్‌ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్‌, కర్రెం గౌరీశంకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
Ramoji Rao: తెలుగు భాషకు రామోజీ చేసిన సేవలు మరువలేనివి..