Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో TDP పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలో వెల్లడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. 3 ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చాయని, బీసీలకు ఇస్తే గట్టిపోటీ ఇస్తామని నేతలు చెప్పగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో అచేతనంగా మారింది. ఇప్పుడు.. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితమవడంతో తెలంగాణ టీడీపీ నేతలు ఎలా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.. వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ నేతలకు చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. మొన్నటి నుంచి చంద్రబాబు రాజకీయ ప్రయోగం చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మునుగోడులో పోటీ చేసే విషయమై తెలంగాణ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింలు ముఖ్య నేతలతో చర్చించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తాను పోటీ చేస్తే పార్టీకి కలిగే ప్రయోజనాలను బాబు వివరించినట్లు తెలుస్తోంది. అధినేత ఆదేశిస్తే బరిలో నిలిచేందుకు సిద్ధమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మునుగోడు ఇన్‌చార్జి జక్కలి ఐలయ్య యాదవ్ కోరినట్లు సమాచారం.
Read also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు బలిగొన్న ఓవర్ స్పీడ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 25 రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. ఇవాళ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో చౌటుప్పల్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్ బాధ్యతలు అప్పగించగా ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో రోడ్‌షో నిర్వహించారు. టీఆర్‌ఎస్, బీజేపీ పై విరుచుకుపడ్డారు. కార్మికులు, ప్రైవేటు ఉద్యోగుల ఓట్లే లక్ష్యంగా మంత్రి మల్లారెడ్డితో చౌటుప్పల్‌లో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెట్టారు. నేటి నుంచి 12 రోజుల పాటు తాను మునుగోడు ప్రచారంలో పాల్గొంటానని, భారీ జనసమీకరణతో నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాయకులు, అభ్యర్థి ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయాలని, ఇతర ప్రాంతాల నుంచి మునుగోడుకు వచ్చిన నేతలకు వసతి, భోజన సౌకర్యాల ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. యాదవుల ఓట్లే లక్ష్యంగా చౌటుప్పల్‌లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సభ నిర్వహించారు.
ఉప ఎన్నిక బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే…
టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
కాంగ్రెస్ తన అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించగా..
బీజేపీ తన అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్
బీసీ సామాజికవర్గానికి చెందిన ఆందోజు శంకరాచారిని అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు.
దీంతో ఉప ఎన్నికలకు ప్రచారంలో పాల్గొనేందుకు పోటా పోటీ కార్యక్రామాలు సిద్దం చేశారు పార్టీ శ్రేణులు.
Pawan Kalyan: దేనికీ గర్జనలు? పవన్ పవర్ పంచ్ లు
