Site icon NTV Telugu

Hyderabad: గంజాయి కేసులో ఏపీ టీడీపీ మహిళా నేత అరెస్ట్

Tdp Leader Min

Tdp Leader Min

హైదరాబాద్ నగరంలో గంజాయి తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నమోదైన ఓ గంజాయి కేసులో ఏపీ టీడీపీ మహిళా నేత జాహ్నవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 2013లో నమోదైన కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

Read Also:

Pregnant Walking: భర్త వేధింపులు….గర్భిణీ 65 కిలోమీటర్ల నడక

గంజాయి తరలింపులో ఎన్‌డీపీసీ యాక్ట్ కింద నలుగురిపై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇదే కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో నిందితుడైన మరో వ్యక్తి శ్రీనివాస్ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. కాగా జాహ్నవిని నర్సరావుపేటలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఎలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version