తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదం చిక్కుకున్నారు.. ఆయన హైదరాబాద్ శివారులో కోడిపందాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్.. పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే, కోడిపందాల్లో తాను లేనంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.. కానీ, దీనికి ఓ వీడియోతో కౌంటర్ ఇచ్చారు పోలీసులు.. ఘటనా స్థలంలో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను విడుదల చేశారు.. చింతమనేనికి కౌంటర్ ఇస్తూ.. పోలీసులు ఆయన ఉన్న వీడియోను విడుదల చేశారు. కాగా, పెదకంజర్ల గ్రామంలోని పెద్ద ఎత్తున పందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. 21 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులను చూసి చింతమనేని ప్రభాకర్ పరారయ్యాడు. ఇక, ఘటనా స్థంలో 13.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 26 వాహనాలను సీజ్ చేశారు. గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం.
Read Also: Telangana: మరో బాదుడుకు రంగం సిద్ధం..!