NTV Telugu Site icon

YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..

Sharmila Chandrababu

Sharmila Chandrababu

YS Sharmila: హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కాంగ్రెస్‌ నాయకురాలు షర్మిల ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లను కూడా ఆహ్వానించారు. కాగా, షర్మిల తనయుడు రాజా రెడ్డికి ప్రియా అట్లూరితో ఈ నెల 18న నిశ్చితార్థం జరిగి ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. చంద్రబాబును పెళ్లి ప్రతిక ఇచ్చి ఆహ్వానించామని అన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారన్నారనిషర్మిల అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబానికి కేక్ పంపినట్లు ఆమె తెలిపారు. లోకేష్ తనకు బహుమతి కూడా పంపారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు పెళ్లికి తప్పకుండా హాజరవుతానని చెప్పారని అన్నారు. చంద్రబాబుని సాధారణంగా చూడాలని అన్నారు. ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు. రాజకీయాలు మా ప్రొఫెషన్.. జీవితాలు కాదన్నారు. ఒకరినొకరు మాటలు అనుకుంటాం.. రాజకీయంగా బాబుకు మాకు లావాదేవీలు ఉండవన్నారు. రాజకీయాలు ఫ్రెండ్లి గా ఉండాలని షర్మిల అన్నారు.

Read also: Bangladesh Cricket Board: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. తాజాగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. కాబోయే వధూవరులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కుమారుడి పెళ్లి తర్వాత షర్మిల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనమైన నేపథ్యంలో అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Uddhav Thackeray: కాలారామ్ ఆలయంలో హారతికి రావాలని రాష్ట్రపతికి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం..