Site icon NTV Telugu

Chandrababu Naidu: హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే!

Chandra 1

Chandra 1

హైదరాబాద్ ని అభివృద్ధి పథం వైపు, టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకువెళ్లింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. హైదరాబాద్‌లో టెక్నాలజీ మా చలవే అన్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధి కాసానితో సాధ్యమవుతుందని అందరిని సంప్రదించి అధ్యక్షుడుని చేసాం. టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ.. టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలి. ఇంకో ఏడాది అయితే తెలుగు రాష్ట్రాల విభజన పూర్తవుతుందన్నారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Chandrababu and Lokesh: కుప్పం, మంగళగిరిలో అబ్బాకొడుకులు ఇద్దరూ ఓడిపోతారు..!

ఇక్కడ శ్రద్దపెట్టలేదు అంటే..ఏపీ అభివృద్ధి కోసమే. 2020 విజన్ అంటే ఆనాడు ఎగతాళి చేశారు. దుబాయ్, సింగపూర్ కంటే బెటర్ గా లేదా హైదరాబాద్ ఇవ్వాళ. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే నేను ప్రయత్నం చేశానన్నారు. హైదరాబాద్ లో టెక్నాలజీ అంత మేం చేసిందే..ఐటీ కంపెనీలు వచ్చాయి, భూముల విలువలు పెరిగాయి. దేశంలో భూముల విలువలు భారీగా పెరిగాయి. తెలంగాణలో ల్యాండ్ వ్యాల్యూ పెరగటానికి కారణం టీడీపీయే అన్నారు చంద్రబాబునాయుడు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ పటిష్టతకు శాయశక్తులా పనిచేస్తానన్నారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీపీలోకి వచ్చానన్నారు. చంద్రబాబు అంటే క్షమశిక్షణ… క్రమశిక్షణ అంటే చంద్రబాబు. ఎన్టీఆర్ ఒక్క పిలుపుతో అన్ని జిల్లాల నుంచి టీడీపీ జెండా పట్టుకున్నారు యువత. టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ గ్రామాన తిరుగుతానన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే టీటీడీపీ ఎజెండా అన్నారు. చంద్రబాబు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు కాసాని జ్ఞానేశ్వర్.

Read Also: Yogi Vemana University: వేమన వర్శిటీలో వైఎస్ విగ్రహం వివాదం.. వీసీ ఏమన్నారంటే?

Exit mobile version