సంగారెడ్డి, నిజాంపేట్ మున్సిపాలిటీలలో టాస్క్ ఫోర్స్ కూల్చివేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు, వాటిలో 84 నిర్మాణాల కూల్చివేత, 23 అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దాడులు కొనసాగుతున్నాయి.శుక్రవారం నాడు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమాలను నిర్వహించాయి.
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు(4) అక్రమ నిర్మాణాలను, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలను శుక్రవారం అధికారులు కూల్చివేశారు.సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 500 చదరపు గజాల కు మించిన స్థలాల్లో జి ప్లస్ టు (G+2) నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వాటిపై అక్రమంగా మరో రెండు, మూడు అంతస్తులు నిర్మించడంమే కాకుండ వాటి మధ్య “పెంట్ హౌస్” నిర్మాణాలు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించి వాటిని శుక్రవారం కూల్చివేశారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ లో 300 చదరపు గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు (షాపింగ్ షట్టర్లు)జరపడం, వాటిలో ఒక షట్టర్ లో లిక్కర్ షాపు పనిచేస్తుండాన్ని గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజాంపేట్ లో 630 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ ప్లస్ టు(G+2) నిర్మాణానికి అనుమతి పొంది వాటిపైన అదనంగా మూడు(3) అంతస్తులు, దానిపైన “పెంట్ హౌస్” ను గుర్తించి టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం వాటిని కూల్చివేశారు.
ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ సంయుక్తంగా 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. వాటిలో 84 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు మరో 23 అక్రమ నిర్మాణాలను అధికారులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!