Site icon NTV Telugu

Tarun Chugh: కేసీఆర్ ప్రతి లెక్కా మా దగ్గర ఉంది

తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పొలిటికల్ టూరిజం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్నారు. ఇండియాకు ఎందుకు ఉక్రెయిన్, రష్యా లకు కేసీఆర్ అధ్యక్షుడు అవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుందంట. మాకు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి అవసరం లేదన్నారు తరుణ్ చుగ్. ఏ కిషోర్ లు కేసీఆర్ ని కాపాడలేరు. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది.

కుటుంబ పాలన చేస్తున్న వారికే వ్యూహకర్తలు అవసరం. మా బూత్ ఇన్‌చార్జ్ బూత్ ఎలా గెలవాలి ప్లాన్ చేస్తాడు? మాకు పీకేలు అవసరం లేదు. తెలంగాణ లో జరిగే పోరాటం బీజేపీ టీఆర్‌ఎస్‌ల మధ్యకాదు. కుటుంబ రాజకీయానికి. ,తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం. కేసీఆర్ ప్రధాని అని పగటి కలలు కంటున్నారు. ముంగేరి లాల్ కలలు కంటున్నాడన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ పొగొట్టుకుంది తెలంగాణలో వెతుకుతున్నది బయట. ప్రధాని మోడీ మీద ఇప్పటి వరకు ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేదన్నారు.

https://ntvtelugu.com/geetha-reddy-satirical-comments-on-cm-kcr-and-prashant-kishor/

కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారు. అద్దంలో తన ముఖం చూసుకొని మోడీ పై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రతి లెక్క మా దగ్గర ఉంది. కేసీఆర్ ది మునిగి పోయే నావ అన్నారు తరుణ్ చుగ్.

Exit mobile version