Site icon NTV Telugu

Bandi Sanjay Pada Yatra: హైదరాబాద్‌ చేరుకున్న తరుణ్‌ చుగ్‌.. మధ్యాహ్నం కమిటీ సభ్యులతో భేటీ

Bandi Sanjay Tarunchug

Bandi Sanjay Tarunchug

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ చేరుకున్న ఆయన వరుస మీటింగ్ లతో ఆయన బిజీగా గడపనున్నారు. ముందుగా చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఆగస్టు 21న జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేతల లిస్టుపై చర్చించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎంత మంది నాయకులను సంప్రదించారు, పార్టీలో చేరేందుకు ఎవరెవరు సంసిద్ధత వ్యక్తం చేశారన్న అంశాలను చేరికల కమిటీ సభ్యులు చుగ్ కు వివరణ ఇవ్వనున్నారు.

read also: Rakhi Pournami Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ వైఫల్యాలు.. ప్రజా సమస్యల అధ్యయన కమిటీ సభ్యులతో చుగ్ భేటీ కానున్నారు. ఇక మునుగోడులో ఉన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చ, మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ తీసే అవకాశముందని సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ చేపట్టిన ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో తరుణ్ చుగ్ పాల్గొంటారు. అయితే.. పార్లమెంట్ ప్రవాసీ యోజన, బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకోనున్నారు. ఇవాళ సాయంత్రం బండి సంజయ్ పాదయాత్రలోనూ తరుణ్ చుగ్ పాల్గొననున్నారు.
Macherla Niyojakavargam Movie Review : మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రివ్యూ

Exit mobile version