Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..
- తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు
- బాలీవుడ్ నటుడు సహా పలువురి అరెస్ట్
- ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులు
- 64 మందికి డ్రగ్స్ టెస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిటీ శివార్లలోని రిసార్టులు మరోసారి మాదకద్రవ్యాల వేదికగా మారుతున్నాయి. గండిపేట్ సమీపంలోని చారిత్రాత్మక తారామతి బారాదరి రిసార్ట్ వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ డ్రగ్స్ పార్టీని పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో బాలీవుడ్ నటుడు సర్వర్ సహా పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది.
Also Read
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఒక ప్రైవేట్ సంస్థ “మోర్ దాన్ ద ఫ్రెండ్స్” (More Than The Friends) అనే పేరుతో ఈ విందును ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి బాలీవుడ్ , టాలీవుడ్ కు చెందిన నటులు, హై-ప్రొఫైల్ వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పోలీసుల ప్రత్యేక బృందం ‘ఈగల్ టీమ్’ రిసార్ట్‌పై ఆకస్మికంగా సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో బాలీవుడ్ నటుడు సర్వర్, ప్రముఖ డీజే జాన్సన్, వ్యాపారవేత్తలు నిహార్, యోగేశ్వర్, అసి , ఫార్మస్యూటికల్ అనలిస్ట్ అవినాష్ ఉన్నారు. వీరితో పాటు పార్టీలో పాల్గొన్న మొత్తం 64 మంది నుంచి పోలీసులు రక్త నమూనాలను (Samples) సేకరించారు. ఈ నమూనాలను ల్యాబ్‌కు పంపి పరీక్షించిన తర్వాత మరికొందరి అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..
నగరంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో రిసార్టులు, ఫామ్ హౌస్‌లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచారు. తారామతి బారాదరి వంటి ప్రభుత్వ పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..