Tandra Vinod Rao: ఒక్క సారి నాకు అవకాశం కల్పించాలని ఖమ్మం బీజేపీ పార్లమెంటు అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ కార్యాలయంలో తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ.. నేను ఈ గడ్డ బిడ్డను.. నాకు ఇక్కడ సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి చేయడానికి నాకు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలన్నారు. నేను రాష్ట్రియా స్వయం సహాయక సంఘ్ లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. నా విద్యాభ్యాసం మొత్తం పాల్వంచలోనే జరిగిందన్నారు. నరేంద్ర మోడీ 400 పైన స్థానాలను గెలుపొందడం ఖాయమన్నారు. 12 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు, మరిన్ని సెంట్రల్ నిధులతో పార్క్లు, రైల్వేస్టేషన్ లు అధునికరించడం జరిగిందన్నారు.
Read also: Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
భద్రాచలం మన జిల్లాలో ఉండడం మన అదృష్టం.. భద్రాచలం నుండి అయోధ్య వరకు ఒక కరిడారు నిర్మించాలని ఉందన్నారు. గత పది సంవత్సరాలుగా సెంట్రల్ నిధులు అడగకుండానే అనేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఖమ్మం పార్లమెంట్ లో ఎంతో మంది పార్టీ లకు అవకాశం కల్పించారన్నారు. ఈ ఒక్క సారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపిస్తే.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం తో పాటు సెంట్రల్ లో అనేక సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తా అని తెలిపారు. మోడీ అంటే గ్యారంటీ.. గ్యారంటీ అంటే మోడీ అని తెలిపారు. మేము చేసేవే చేబుతాం చేప్పేటియే ప్రజలకు చేబుతామన్నారు. ఒక్క సారి నాకు అవకాశం కల్పించాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు.
MLA Raja Singh: ఎమ్మేల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్..