Site icon NTV Telugu

Tammineni Krishnaiah: పోలీసుల అదుపులో తమ్మినేని కృష్ణయ్య హత్య నిందితులు.. ఏపీలో అరెస్ట్..!

Tammineni Krishnaiah Murder

Tammineni Krishnaiah Murder

Tammineni Krishnaiah: సంచలనం సృష్టించిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. వీరిని ఆంధ్ర ప్రదేశ్ లో అరెస్టు చేసారు. నిందితులను పట్టుకోవడం కోసం ఏసీపీ శభరీష్ నాయకత్వంలో ఒకటీం ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లింది. గత మూడు రోజుల నుంచి పలుపాంత్రాల్లో వుండి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుకు సంబందించి నిందితుల ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ఇవాళ తెల్లవారు జామున నిందితులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. నిందితులను ఖమ్మంకు తీసుకుని వచ్చి ఇంటరాగేషన్ చేయనున్నారు.

అదేగ్రామానికి చెందిన తమ్మినేని కోటేశ్వర రావు సలహా మేరకే ఏడుగురు వ్యక్తులు కృష్ణయ్య హత్యలో పాల్గొన్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా ఎనిమిది మందిని ఈ కేసుల నిందితులుగా చేర్చారు. వారిమీద 148, 341, 132, 302, 149 సెక్షన్ క్రింద కసులు నమోదు చేశారు. నిందితులన పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా A1 గాఉన్న తమ్మినేని కోటేశ్వరరావు , కృష్ణ మినహా మిగిలిన వారందరిని పోలీసులు అరెస్టు చేసారు. A2 గా ఉన్న రంజాన్, A4 గంజి స్వామి, A5 నూకల లింగయ్య, A6 బోడపట్ల శ్రీను, A7 నాగేశ్వరరావు A8 ఎల్లంపల్లి నాగయ్యను పోలీసులు అరెస్టు చేశారు. వీరందరిని ఖమ్మం తీసుకెళ్లారు.

ఆగస్టు 15న ఖమ్మం జిల్లా తెల్దార పల్లిలో టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని తమ్మినేని కృష్ణయ్యను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పొన్నెకల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగురవేసిన తర్వాత కృష్ణయ్య బైక్‌పై వెళ్లగా.. ఆయన్ను వెంబడించి దుండగులు హతమార్చారు. ఈ ఎటాక్‌లో కృష్ణయ్య స్పాట్‌లోనే మృతి చెందారు. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఈహత్య జరిగింది. కృష్ణయ్య ఒంటిపై 12 కత్తిపోట్లు, మొత్తం ఐదుగురు చుట్టుముట్టి హత్య చేసారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version