NTV Telugu Site icon

Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తాం

Talasani

Talasani

Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. నగరంలో వర్షాలకు ఎలాంటి ప్రాణా, ఆస్థి నష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. నాలాల అంభివృద్ధి చేశారని.. చాల ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పాయని అన్నారు. హుస్సేన్ సాగర్ లో 2 వెల క్యూసెక్కులు కిందకు వదులుతున్నామని అన్నారు. నాలాల దగ్గ్గర ఆక్రమ నిర్మాణాలతో కొన్ని ఇబ్బందులు అయ్యాయని తెలిపారు. ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే వారికి నష్టపరిహారం కూడా ఇస్తామన్నారు. రానున్న వారం పాటు వర్షాలు ఉన్నాయనే సమాచారం ఉందని తెలిపారు. వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయాలని కోరారు. వెంటనే సమస్యలు పరిస్కరిస్తున్నామని తెలిపారు.

Read also: Project K: ‘కల్కి’లో అతిపెద్ద సస్పెన్స్ ఇదే…

426 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా 157 స్టాటిక్ టీంలు రంగంలోకి దిగి నీటిని తొలగించి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించే పనులు చేపడుతున్నారు. 339 వాటర్‌లాగింగ్‌ పాయింట్ల వద్ద చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. డీఆర్‌ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేస్తున్నారు. నగరంలోని 185 చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కమిషనర్ రొనాల్డ్రోస్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం రాత్రి 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, 15 ప్రాంతాల్లో నీరు నిలిచిందని, మరో రెండు చోట్ల గోడలు కూలిపోయాయని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
Brain Chip: బ్రెయిన్‌లో చిప్‌.. చివరకు ఏమైందంటే..?