చినుకు పడితే చాలు.. హైదరాబాద్‌లో కాలనీలు చెరువుల్లా మారతాయి. నాలాలు ఆక్రమణకు గురికావడం వల్ల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ వుంటుంది. నాలాల అభివృద్ధితో వరదముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి తలసాని.
ప్రతి ఏటా వర్షాకాలంలో వరదముంపుకు గురవుతున్న నాలా పరిసర కాలనీలలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టింది. మున్సిపల్ శాఖ మంత్రి KTR చొరవతో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి SNDP కార్యక్రమం ద్వారా నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి చేపడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో బేగంపేట నాలా పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారన్నారు మంత్రి తలసాని.
కాలనీలు మొత్తం నీట మునిగిపోయేవని, 45 కోట్ల రూపాయల వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఎన్నో సంవత్సరాల ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది. గత ప్రభుత్వాలు నాలాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వరదల సమయంలో వచ్చి కనిపించారే తప్ప సమస్య ను పరిష్కరించాలనే ఆలోచన కూడా చేయలేదు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి తలసాని.
Covid Vaccine: గుడ్ న్యూస్.. నోటి మాత్రల రూపంలో కరోనా వ్యాక్సిన్
