Site icon NTV Telugu

Talasani Srinivas Yadav: చిల్లర రాజకీయాలు చేయొద్దు.. బీజేపీకి వార్నింగ్

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

తెలంగాణ భవన్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల పరిస్థితులలో టీఆర్ఎస్ అభ్యర్థికి మంచి మెజార్టీ వస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుళ్ళు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్నాయి. మేం గెలిస్తే 3వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాయి. దుబ్బాక, హుజారాబాడ్ లో ఒక్క రూపాయి ఇవ్వలేదు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కెసిఆర్ కోరుకున్నారు.. అందుకు గొల్ల, కురుమలకు ఆర్థికంగా బలోపేతం కోసం వారికి గొర్రెలను ఇస్తున్నాం..యూనిట్ కాస్ట్ ని కూడా పెంచం… లక్షా ఇరవై అయిదు వేల నుంచి 1,75 వేలకు పెంచాం.. బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ స్కీమ్ కొద్ది రోజులు ఆగిపోయింది.

Read Also: Vijay Devarakonda: ‘లైగర్’ ఫ్లాప్ నుంచి విజయ్ ఇంకా తేరుకోలేదా..?

మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత యధావిధిగా కొనసాగిస్తాం.. రాష్ట్రంలో ఉన్న గొల్ల, కురుమలు ఆందోళన పడొద్దు. డబ్బులు రాకుండా ఆపడం బీజేపీ, కాంగ్రెస్ కుట్ర. ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు కుదరవు.. ఎల్లకాలం వీటిని ఆపలేరు… ఎన్నికల కోడ్ తర్వాత మీ డబ్బు మీకు చెందుతుంది.. మీరు కేంద్రం నుంచి రూపాయి తెచ్చింది లేదు…ఓ వైపు కంప్లైంట్ ఇచ్చేది మీరే… మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నా ఇల్లు అమ్మి మీకు ఇస్తా అని మాటలు చెప్తున్నారు. కాంట్రాక్ట్ కోసం ఎన్నిక వచ్చింది.. మీకు బీజేపీ కి ఉన్నది ముగ్గురు… మీ వల్ల ఏమవుతుంది? 3 వేళ పెన్షన్ ఎలా ఇస్తావు… మీరు గెలిచిన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అవుతావు… అంతకు మించి ఏంకాదు బీజేపీ వల్ల అన్నారు శ్రీనివాస్ యాదవ్.

తప్పకుండా బీజేపీ కి బుద్ది చెప్తాం.. గొల్ల, కురుమలు ఎవరు అధైర్యపడవద్దు.. బల్దియా ఎన్నికలలో వరద బాధితులకు పదివేల రూపాయిలు ఇచ్చాం.. మేము బీజేపీ మాదిరి కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తాం అని చెప్పలేదు.. రైతుబందు, దళిత బందు ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదు. మేము గొల్ల, కురుమల ప్రతినిధి గా చెప్తున్న, మీరు దైర్యంగా వుండండి. ఎవరు ఈ డబ్బులను ఆపలేరు. రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో పంచుతాం. పైలట్ కింద DPT కింద ఇస్తాం. నాలుగు ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడేస్తారు బీజేపీ వాళ్లు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి… అవన్నీ నిజం కాదు. డబుల్ బెడ్ రూం అనేది దేశంలో ఎక్కడ లేని స్కీం ఇది. సిటీలో ఉపఎన్నిక వస్తుంది అన్న వార్తలు అవాస్తవం… అవన్నీ గాలి వార్తలు.. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం అన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్.

Read Also: Vijay Devarakonda: ‘లైగర్’ ఫ్లాప్ నుంచి విజయ్ ఇంకా తేరుకోలేదా..?

Exit mobile version