NTV Telugu Site icon

Vote Selfie: ఓటేస్తూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే.. చిక్కుల్లో పడ్డట్లే..!

Vote Selfi

Vote Selfi

Vote Selfie: ఓటింగ్ అనేది అత్యంత రహస్య ప్రక్రియ. ఓటర్లు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ.. వేసిన ఓటు ఎవరికి వేసారో అత్యంత రహస్యంగా ఉంచి ఓటరు మహాశయుని హక్కుకు భంగం కలగకుండా చూడాలి. అయితే కొందరు ఓటు వేసిన తరువాత బ్యాలెడ్ బాక్స్ దగ్గరే నిలబడి సెల్ఫీ ఫోటోలు తీస్తూ.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరొకొందరైతే.. ఓటేస్తూ సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో వైరల్ అవడానికి పోస్ట్ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. అలాంటిది ఇప్పుడు అలా సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారో నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది. యస్ మీరు విన్నది నిజమే.

ఇక మరోవైపు సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సెల్ఫీలు దిగి ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇక కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా.. ఇలా చేసే పనేదైనా సెల్ఫీ దిగడం ఆనవాయితీగా మారిపోతుంది. దిగిన సెల్పీని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది. నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు దిగుతున్న వారు కోకొల్లలు. అయితే.. ఈ అలవాటును ఓటేసేటప్పుడు చూపించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ దిగడం వరకు ఓకే కానీ.. లోపలికి ఫోన్ తీసుకెళ్లినా, ఓటేస్తూ ఫొటో దిగినా చిక్కుల్లో పడతారని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది. పొరపాటున లేక సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ఫోన్ తీసుకెళ్లి సెల్ఫీ దిగారో ఇక మీ జీవితం జైలుపాలవుతారని హెచ్చరిస్తుంది.

మీరు.. ఓటేస్తూ సెల్ఫీ దిగినా.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరని తెలిపింది. కాగా.. నిబంధనలు అతిక్రమించినందుకు పోలీస్ కేసు నమోదు చేస్తారు. అంతేకాదండోయ్.. ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. ఇక మరోవైపు, కళ్లు కనిపించని వారు ఓటేసేందుకు సహాయకుడిని అనుమతిస్తామని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. కాగా.. అప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తినే సహాయకుడిగా అంగీకరిస్తామని చెబుతున్నారు. సదరు అంధుడు ఎవరికి ఓటేశాడనే విషయాన్ని బహిరంగ పరచబోనని సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందుకే మన ఓటు మనం వేస్తే చాలు అందరికి పంచుకుందామని ఒకవేళ లోపలికి వెళ్లి సెల్పీ దిగారో జైలులో ఊసలు లెక్కపెడతారు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి. ఇక 2021లో ఏపీలో మండలి ఎన్నికల్లో కొందరు ఓటర్లు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే..
Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్‌