NTV Telugu Site icon

Uttam Kumar Reddy: ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. కాంగ్రెస్‌ మాత్రమే ఓటు వేయండి

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Take money from whoever gives but.. vote only Congress: బీజేపీ మత కొల్లోలాలు సృష్టిస్తుంది! తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని నల్లగొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్, ఉత్తంకుమార్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. టీఆర్‌ఎస్‌ రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యలు తెలంగాణలో పెరిగిపోయాయని అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఏనాడు నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ తో దోస్తీ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు క్రాంటాక్ట్ పనులను రాజగోపాల్ రెడ్డి దక్కించుకున్నాడని మండిపడ్డారు. చర్లగూడెం ముంపు బాధితులను ఆదుకునే విషయంలో రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించాడని నిప్పులు చరిగారు. ఐదు శాతం జీఎస్టీతో చేనేత కార్మికుల పొట్ట కొట్టిన పార్టీ బీజేపీ, అలాంటి పార్టీతో రాజగోపాల్ రెడ్డి జతకట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ రైతులను మాత్రం నాడు రోడ్డున పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో కొత్త ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఏం అభివృద్ధి చేశారని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ లు ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మునుగోడు ఓటర్లు చైతన్యవంతులు, విజ్ఞతతో ఓటేస్తారన్న నమ్మకం మాకుందని అన్నారు. బీజేపీ మునుగోడులో అడుగుపెడితే మత కొల్లోలాలు సృష్టిస్తుంది, తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని అన్నారు. మతకల్లోలాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వాడిన పదజాలం, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా చేసిందని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
CPI State Conference: రేపటి నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు.. 800 మంది పాల్గొనే అవకాశం

Show comments