NTV Telugu Site icon

Swine Flu Cases In Adilabad: కలవరపెడుతున్న స్వైన్‌ ఫ్లూ.. మూడుకు చేరిన కేసుల సంఖ్య

Swine Flu Case In Adilabad

Swine Flu Case In Adilabad

ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళకు ఆమద్య స్వైన్ ప్లూ నిర్ధారణ కాగా తాజాగా మరో రెండు స్వైన్ ప్లూ కేసులు నమోదు అయినట్లు రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. రామ్ నగర్ కు చెందిన వ్యక్తితో పాటు జిల్లా లో మరో వ్యక్తి కి సంబంధించిన శాపింల్స్ పంపించగా ఇద్దరికి స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇటివల వారిద్దరూ శాపింల్ ఇచ్చినట్టుగా తెలిపారు డైరెక్టర్. తాజాగా వచ్చిన రెండు కేసులతో జిల్లాలో స్వైన్ ప్లూ కేసుల సంఖ్య మూడుకు చేరుకున్నాయి.

ఇక ఆగస్టు 14న ఆదిలాబాద్ జిల్లాలోనే స్వైన్ ఫ్లూ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. రిమ్స్‌ కు వచ్చిన జ్వరంతో బాధపడుతున్న పేషెంట్‌కు అనుమానంతో టెస్టులు చేయగా, స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా మార్గదర్శకాలను పాటించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేరుతున్న బాధితుల వివరాలు మాత్రమే ప్రభుత్వానికి తెలుస్తున్నాయి. ఉట్నూరులోని కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతున్న ఆత్రం కవిత అనే 15 ఏళ్ల విద్యార్థిని రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా.. ఆదిలాబాద్ జిల్లాలో టీబీ కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Advocate Akbar Death Mystery: అడ్వకేట్ అక్బర్ కేసులో ఆమే విలన్ … అసలేం జరిగింది?