Site icon NTV Telugu

Telangana CM: ఇటు సీజే ప్రమాణం.. అటు టీహబ్ ప్రారంభం.. మరి సీఎం ఎటు?

Tamilasai Kct

Tamilasai Kct

ఈనెల 28న‌(రేపు) రాజ్‌భ‌వ‌న్ లో హైకోర్టు నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జిస్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌తో తెలంగాణ గ‌ర‌వ్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌రరాజ‌న్ ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు. అయితే రాజ్యాంగం ప్ర‌కారం హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో ప్ర‌మాణం చేయించేది గ‌వ‌ర్న‌ర్‌.. కాగా రాజ్ భ‌వ‌న్ లో ఈ సాంప్ర‌దాయం జ‌ర‌గ‌నుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్‌ ప్రకారం.. ఉన్నతాధికారులు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరలు హాజర‌వ్వాలి. అయితే గ‌త కొంత కాలంగా సీఎం రాజ్ భ‌వ‌న్‌కు దూరంగా వుంటున్నారు. దీనికి కార‌ణం గ‌ర్న‌ర్ తో విభేదాల‌ని స‌మాచారం. సీజే ప్రమాణ స్వీకారానికి సీఎం హాజ‌ర‌వుతారా అనే ప్ర‌శ్న చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇది ఇలా వుంటే అదే స‌మ‌యంలో హైదరాబాద్ లోని టీ-హ‌బ్ రెండో ద‌శ భ‌వ‌నాన్ని సీఎం ప్రారంభించ‌నున్నారు.

కొద్దిరోజులుగా ఈ భ‌వ‌నానికి మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా ఈ టీ-హ‌బ్ ను సీఎం ప్రారంభిస్తారంటూ ఆదివారం కేటీఆర్ ట్వీట్ పోస్ట్ చేశారు. దీంతో సీజే ప్ర‌మాణానికి సీఎం వెళ‌తారా? లేక టీ-హ‌బ్ ప్రారంభానికి వెళ‌తారా? అంటూ ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ తో కొద్దిరోజులుగా విభేదాల కారంగానే వ్యూహాత్మకంగానే కార్యక్రమాన్ని మార్చార‌ని, రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల టాక్‌. కాగా.. ఇంతకుముందు కూడా రెండుసార్లు ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు సీఎం కేసీఆర్‌. మ‌రి సీజే ప్ర‌మాణానికి కూడా దూరంగా వుంటార‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌. అయితే.. గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య పలు అంశాలతో దాదాపు ఏడాది నుంచి విభేదాలు తలెత్తి ఒకదశలో పరస్పర విమర్శల వరకు దారి తీసింది.

అప్ప‌ట్లో గవర్నర్‌ తమిళిసై.. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని నామినేట్‌ చేయాలన్న ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టిననాటి నుంచి రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు పొసగడం లేదని రాజకీయ వర్గాల్లో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అంటే.. దాదాపు పది నెలలుగా రాజ్‌భవన్‌ గడప సీఎం తొక్కలేదు. కాగా.. అధికార పరిధిని అతిక్రమించి గవర్నర్‌ తమిళిసై వ్యవహరిస్తున్నారని.. రాజ్‌భవన్‌ను బీజేపీ అడ్డాగా మార్చారని మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు నేరుగానే ఆరోపణలు చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ నియామక విషయంలోనూ గవర్నర్‌ ప్రభుత్వ ప్రతిపాదలను పక్కనపెట్టడ‌మే కాకుండా.. పూర్తిస్థాయి చైర్మన్‌ను ఎన్నుకోవాలని సూచించడం కూడా ఈ దూరానికి కార‌ణం అంటున్నారు. అంతేకాకుండా ఈఏడాది జనవరి26న గణతంత్ర దిన వేడుకలను రాజ్‌భవన్ లో జ‌రిగినా ఆవేడుక‌ల‌కు సీఎం సహా మంత్రులు, సీఎస్, డీజీపీ కూడా హాజరుకాకపోవడంతో గవర్నర్, సీఎం మధ్య దూరం మరింతగా పెరిగింది. ఇక శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సమయంలో అసెంబ్లీ ప్రోరోగ్‌ కాలేదన్న సాంకేతిక కారణం చూపుతూ గవర్నర్ త‌మిళ‌సైను ప్రభుత్వం ఆహ్వానించక‌పోవ‌డంతో.. మ‌నస్తాపం చెందిన గవర్నర్‌ ప్రభుత్వం గవర్నర్‌కు మర్యాద ఇవ్వడం లేదంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

గ‌త కొద్దిరోజుల ముందు గవర్నర్‌ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆమెకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలకపోవ‌డంతో.. రాష్ట్రంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. అంతే కాకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర హోంశాఖకు పంపారు. గవర్నర్‌ తాజాగా రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ నిర్వహించడంపైనా టీఆర్‌ఎస్ శ్రేణులు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది ఇలా వుంటే వీటన్నిటి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వెళతారా? లేదా అన్నదానిపై ఆసక్తి క‌రంగా మారింది.

Allu Arjun: పుష్ప-2 తర్వాత బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఎవరికి?

Exit mobile version