Site icon NTV Telugu

Medipally Murder Update: స్వాతి హత్య కేసు.. సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్

Mahender Reddy Swathi

Mahender Reddy Swathi

Medipally Murder Update: సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా తీసుకుంది. కేసు పూర్తి వివరాలు అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో స్వాతి శరీర భాగాలు ఇప్పటికీ దొరకకపోవడం గమనార్హం. పోలీసుల విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం, ముందుగా కవర్లలో చుట్టి మూసీ నదిలో పారవేశానని చెప్పడంతో పోలీసులు పది కిలోమీటర్ల మేర గాలించారు. కానీ ఫలితం దక్కలేదు.

Mass Jathara : అఫీషియల్.. ఆగస్టు 27న మాస్ జాతర రిలీజ్ వాయిదా

మహేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, స్వాతిని హత్య చేసిన తర్వాత ముందుగానే కొని ఉంచిన హ్యాక్సా బ్లేడ్‌తో శరీర భాగాలను వేరు చేశాడు. కాళ్లు, చేతులు, తలలను విడివిడిగా మూడు చెత్త కవర్లలో పెట్టాడు. తలకు ఇంటిపై ఉన్న ఇటుకలు కట్టి, ఆ కవర్‌ను బ్యాగ్‌లో వేసుకున్నాడు. చేతులు ఉన్న కవర్‌ను బస్తాలో వేసుకుని బైక్‌పై పెట్టుకున్నాడు. ప్రతాపసింగారం వద్ద ఉన్న మూసీ నదిలో ఈ రెండు కవర్లను పారవేశాడు. తిరిగి వచ్చేటప్పుడు పది కిలోల రాయిని తీసుకువచ్చి, కాళ్లను ఆ రాయికి కట్టి, యూరియా బస్తాలో మూట కట్టాడు. దాన్ని కూడా మూసీలో పడేశానని చెప్పాడు.

స్వాతిని హత్య చేసిన తర్వాత ఆమె మొబైల్ తీసుకుని, ఆమె చెల్లెలు శ్వేతకు “తిన్నారా?” అని మెసేజ్ చేసి, స్వాతి మెసేజ్ చేసినట్లు నమ్మించాడు. ఆ తర్వాత మేడిపల్లిలోని ఓ పాన్ షాప్ వద్ద ఆగి సిగరెట్ తాగుతూ తన చెల్లికి ఫోన్ చేసి, స్వాతి గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. అనంతరం బావ గోవర్ధన్ రెడ్డితో కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో స్వాతి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో ప్రశ్నలకు భయపడి తానే హత్య చేశానని ఒప్పుకున్న మహేందర్ రెడ్డి, శరీర భాగాలు ఎక్కడ పారవేశాడో చూపించాలని పోలీసులు అడిగితే నిద్ర వస్తోందని పోలీస్ స్టేషన్‌లోనే పడుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

Kurnool Crime: కర్నూలులో భర్తను దారుణంగా చంపిన భార్య.. మూడు రోజుల తర్వాత..!

Exit mobile version