NTV Telugu Site icon

Nizamabad:నెల‌రోజుల్లో పెళ్ళి.. డాక్ట‌ర్ అనుమానాస్ప‌ద మృతి!

Nizamabad

Nizamabad

నిజామాబాద్ GGH ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్స్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పద మృతి చెందిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాత్రి వరకు డ్యూటీ లో ఉన్న మహిళా డాక్టర్ ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

హాస్పిటల్ సూపరిండెంట్ మీడియాను లోపాలకి అనుమతించ‌క‌పోవ‌డంతో.. ప‌లు అనుమానాల‌కు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మరో నెల రోజుల్లో డాక్టర్ శ్వేతా పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఈ సమయంలో డాక్టర్ శ్వేతా మృతి చెందడంతో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి. డాక్టర్ శ్వేత కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. డాక్టర్ శ్వేతా మ‌ర‌ణ‌ వార్త విన‌గానే కుటుంబ స‌భ్యులు షాక్ కు గుర‌య్యారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ కు బ‌య‌లుదేరారు. పని ఒత్తిడా .. మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొన‌సాగుతుంది.

సూపరిండెంట్ డా. ప్రతిమరాజ్ వివ‌ర‌ణ :

అయితే డాక్ట‌ర్ శ్వేత మృతిపై సూపరిండెంట్ డా. ప్రతిమ రాజ్ మీడియాతో మాట్లాడారు. డా. శ్వేతా చాలా యాక్టివ్ స్టూడెంట్ అని, ఆమె మృతి మమల్ని షాక్ కి గురి చేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిన్న స్నేహితులతో కలిసి డిన్నర్ చేసిందని వివ‌రించారు. డ్యూటీ అనంతరం రెస్ట్ తీసుకోవడానికి వెళ్లి అక్కడ కుప్ప కూలి పోయిందని పేర్కొన్నారు. డా శ్వేతాకు 2 సార్లు కోవిడ్ వచ్చిందని, కోవిడ్‌ రిలేటెడ్ హార్ట్ స్ట్రోక్ గా అనుమానిస్తున్నామ‌ని అన్నారు. కోవిడ్ తో.. సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని తెలియ‌జేశారు.దీనికి సంబంధించి
తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చామని వాళ్లుకూడా డాక్ట‌ర్ శ్వేత మృతితో షాక్ కి గుర‌య్యార‌ని డా. ప్రతిమ చెప్నారు.

నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి లో విషాదం..అనుమానాస్పదంగా డాక్టర్ మృతి | NTV