NTV Telugu Site icon

Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారు..

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్‌ పర్యటించారు. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, నూతన భవనాల మంజూరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్, ఇతర అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గరిడేపల్లి నుంచి అలింగాపురం రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆతరువాత రూ.30 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించి, రూ. 2 కోట్లు, నేరేడుచెర్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Read also: ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల ఎర్పాటు చేసిందీ మేమే… అభివృద్ధి చేసేది మేమే అని తెలిపారు. పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. కాలేజీకి అవసరమైన ప్రతి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలేజీ అధ్యాపకులు కూడా అడ్మిషన్ పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి అన్నారు. సమాజంలోనే గొప్ప వృత్తి అధ్యాపక వృత్తి.. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని మంత్రి అన్నారు.
Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి