Site icon NTV Telugu

Suryapet: అన్నారం ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం

Suryapet Formers

Suryapet Formers

Suryapet: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఐకేపీ కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి ఎగుమతి చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్‌ మిల్లర్‌ దిగుమతి చేయకుండా ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఎ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో చోటుచేసుకుంది.

Read also: KTR Comments: ఈనెల 29 తెలంగాణ ప్రజలు మరిచి పోలేని రోజు..

బాధితుల వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం చౌళ్లతండాకు చెందిన గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు అన్నారం గ్రామానికి చెందిన గోగుల రామకృష్ణకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పండించిన ధాన్యాన్ని ఈనెల మొదటి వారంలో అన్నారం ఐకేపీ కేంద్రానికి పంపించారు. ఎండబెట్టి, తూర్పారబెట్టాక చేసిన తర్వాత వరిలో తేమ శాతం, నాణ్యతను ఏఈవో పరిశీలించి కొనుగోలుకు ఎంపిక చేశారు. ఈ నెల 16న కాంటా వేశారు. కీమాకు చెందిన 425 బస్తాలు, మరో ఇద్దరు రైతులకు చెందిన 263 బస్తాలు కలిపి మొత్తం 688 బస్తాలను ఈ నెల 17న లారీలో ఎగుమతి చేసి కోదాడలోని వెంకటరమణ రైస్ మిల్లుకు ఎగుమతి చేశారు. వరి ధాన్యం నల్లగా ఉందని, దించలేదని మిల్లు నిర్వాహకులు ఈ నెల 18న ఐకేపీ కేంద్రానికి సమాచారం అందించారు. రైతు కీమా, ఐకేపీ నిర్వాహకులు మిల్లుకు వెళ్లి అడగ్గా వడ్లు బాగోలేదని బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తామని మిల్లు నిర్వాహకులు తెలిపారు.

Read also: Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైంది.. వీడియో కాన్ఫరెన్స్‌ లో భట్టి విక్రమార్క

రైతు కీమా అంగీకరించడానికి నిరాకరించాడు.. తరుగు తగ్గించకుండా దించమని వారిని వేడుకున్నాడు, కానీ మిల్లు మేనేజర్ అంగీకరించలేదు. తరుగుతీస్తే తాను ఒప్పుకునేది లేదని రైతు తిరిగి వచ్చాడు. మిల్లు నిర్వాహకులు శనివారం ఉదయం ధాన్యాన్ని దించకుండానే ఐకేపీ కేంద్రానికి తిరిగి పంపించారు. ధాన్యం లారీ తిరిగి వచ్చిందని ఐకేపీ నిర్వాహకులు చెప్పారు. దీంతో రైతు కీమా దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద లారీ వద్దకు రైతు కీమా దంపతులు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోలు పోసుకుంటున్న సమయంలో సెంటర్‌లోని తోటి రైతులు వారిని చూసి వారి చేతుల్లోని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీంతో వారు స్థానిక తహసీల్దార్ దయానందంకు ఫిర్యాదు చేశారు. వెంటనే తహసీల్దార్ డీటీ కంట్లమయ్య, ఏఓ బాలకృష్ణ, ఏపీఎం రాంబాబు ఐకేపీ సెంటర్‌కు చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మిల్లు యాజమాన్యంతో మాట్లాడి నష్టపోకుండా తిరిగి మిల్లుకు దింపేందుకు పంపించారు. ఆ మిల్లుకు పంపిన ధాన్యానికి బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు.
Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..

Exit mobile version