NTV Telugu Site icon

హఫీజ్‌పేట్‌ భూముల కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court

Supreme Court

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌‌పేట్‌‌ వివాదాస్పద భూముల కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. హఫీజ్‌పేట్‌ భూములపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. భూములను యథాతథ స్థితిలో కొనసాగించాలని ఆదేశించింది.. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజుల క్రితమే మరో స్పెషల్ లీవ్ పిటిషన్‌ని అనుమతిస్తూ సర్వే నెంబర్ 80లో సి కళ్యాణ్‌తో పాటు మరికొందరికి టైటిల్ లేదని.. లేని టైటిల్ భూమిలో ఎలా నిర్మాణాలు చేపడతారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ కేసులో అన్ని పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపడుతుండగా.. అత్యంత విలువైన భూములను తమకు టైటిల్ ఉందని దశాబ్దాలుగా భూమిపై ఉన్నారు బడాబాబులు. కాగా, సర్వే నెంబర్‌‌ 80లోని కోట్లాది రూపాయల విలువైన భూములు తమవేనని రాష్ట్ర సర్కార్, స్టేట్‌‌ వక్ఫ్‌‌బోర్డులు చేసిన వాదనలను గతంలోనే కొట్టివేసింది హైకోర్టు.. ఆ భూములు ప్రైవేట్‌‌వేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అవి వక్ఫ్ భూములంటూ గతంలో ఇచ్చిన గెజిట్‌‌ను న్యాయస్థానం తప్పుబట్టింది.. సర్వే నంబర్ 80డీలోని 50 ఎకరాల భూములను నలుగురు పిటిషనర్ల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించాలని ఆదేశించింది. వారికి కోర్టు ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా గతంలోనే ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు సూచించింది. దీంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం.