Site icon NTV Telugu

Disha Encounter : దిశా ఎన్‌కౌంటర్‌ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court

Supreme Court

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం రేపు తీర్పును వెలువరించనుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసిని విషయం తెలిసిందే. అయితే.. ఈ ఏడాది జనవరిలో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు దిశ ఎన్‌కౌంటర్‌పై నివేదికను అందించింది. హైద్రాబాద్‌కు సమీపంలోని షాద్ నగర్ చటాన్‌పల్లి అండర్ పాస్ వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన 2019 నవంబర్ 28న జరిగింది.

ఈ ఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ.. మహిళా సంఘాలు, ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే.. నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు గాను ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్టుగా అప్పటిసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.

ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశాయి. ఈ ఎన్ కౌంంటర్ పై అనుమానాలు వ్యక్తం చేశాయి. విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్ప్కూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సిర్పూర్కర్ కమిషన్ హైద్రాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది. ఈ కమిషన్ నివేదికను ఈ ఏడాది జనవరి మాసంలో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది.

 

Exit mobile version