NTV Telugu Site icon

టీఎస్‌ జెన్కో, ట్రాన్స్‌కోకు కోర్టు ధిక్కారణ నోటీసులు

Supreme Court

Supreme Court

తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంలో ఈ చర్యలకు పూనుకుంది.. విధుల్లో చేరేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ 84 మంది విద్యుత్‌ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కాగా, గతంలో 1,150 మంది విద్యుత్‌ ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు 50 శాతం చొప్పున కేటాయించారు. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అయితే, 84 మందిని మినహాయించి మిగిలినవారిని చేర్చుకుంది తెలంగాణ సర్కార్.. దీంతో.. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు 84 మంది విద్యుత్ ఉద్యోగులు.. ఈ వ్యవమారంలో జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి, కార్పొరేట్‌ కార్యాలయ అధికారి గోపాలారావుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను జులై 16వ తేదీకి వాయిదా వేసింది.