యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ కేసును PMLA చట్ట కింద కేసునమోదు చేసిన ఈడి సైతం, ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారిస్తుంది. అయితే దేశంలో బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ పిల్ దాఖలు చేశారు.. గత విచారణ సందర్భంగా కే ఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. అయితే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో ఎటువంటి దాఖలు చేయలేదు.. దాంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసారి.
Malegaon blast: “కాషాయ ఉగ్రవాదం కట్టుకథ”, మోహన్ భగవత్ అరెస్ట్ కోరారు: మాజీ ఏటీఎస్ అధికారి సంచలనం..
కేంద్ర ప్రభుత్వంతో పాటు బెట్టింగ్ యాప్స్ లో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్రాలకు, ఈడి, ట్రాయ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో బెట్టింగ్ యాప్ లకు సంబంధించిన అంశాలపై కోర్టుకు రిప్లై ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది.. ఈ కేసు తదుపరి విచారణలో ఆగస్టు 18 వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం..
బెట్టింగ్ యాప్స్ కేసులో పార్టీ పర్సన్ గా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ తన వాదన వినిపించారు.. ధూమపానం కంటే బెట్టింగ్ యాప్స్ మరింత ప్రమాదం అని, దేశంలో ఉన్న యువత బెట్టింగ్ యాప్స్ తో ప్రాణాలు బలి తీసుకుంటున్నారని కోర్టుకు విన్నవించారు పాల్.. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకుండా సెలబ్రిటీలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.. దేశంలో కొన్ని యాప్స్ ను ఇప్పటికే నిషేదించారని.. వాటిలాగే బెట్టింగ్ యాప్స్ ని కూడా నిషేధించాలని కోర్టుకు విన్నవించారు పాల్.. ప్రతి వాదులు ఇచ్చే రిప్లై, అంశాలను పరిశీలించి తదుపరి విచారణ జరిగే ఆగస్టు 18 న ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది..
ENG vs IND: టీమిండియాకు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ అవుట్! ఐదవ టెస్ట్ గెలిచినా?
