NTV Telugu Site icon

Support Moranchapalli: దయనీయ స్థితిలో మోరంచపల్లి వాసులు.. ఆపన్న హస్తం కోసం ఎదరుచూపు

Support Moranchapalli

Support Moranchapalli

Support Moranchapalli: మోరంచ వాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. గురువారం తెల్లవారుజామున వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చెట్టుకొకరు.. పుట్టకొకరుగా పరుగులు పెట్టిన ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి. ఊరిని ముంచిన వాగు శాంతించి వెనక్కి తగ్గినా.. వరద ఉధృతికి సరుకులన్నీ ఏటో కొట్టుకుపోయి ఇళ్లన్నీ నీళ్లు, బురదతో నిండి దయనీయ స్థితిలో ఉన్నారు. వరుద ఉధృతికి కొట్టుకొనిపోయిన తీరుతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ఏవీ లేవిప్పుడు. వరద నీటికి ఇళ్లన్నీ బురదమయం అయ్యాయి.. నిత్యావసరాలు. వాగులో కొట్టుకుపోనయి ఇంట్లో ఉన్న వస్తువులన్ని పాడైనయి వరద ఉధృతికి సర్వం కోల్పోయి నిరాశ్రయులైన మోరాంచపల్లి వాసులకు ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అందలేదు. స్వచ్ఛంద సంస్థలే వారికి అండగా నిలుస్తున్నాయి.

Read also: Facebook Post: సిల్లీ పోస్ట్ పెట్టాడు.. పోలీసులు అతని సరదా తీర్చారు

మోరాంచపల్లి గ్రామంలో 283 ఇళ్లు ఉండగా, సుమారు 985 మంది ప్రజలు నివసిస్తున్న జనాభా ఉంది. ఈ గ్రామం గురువారం తెల్లవారుజామున నీట మునగ్గా.. శుక్ర, శనివారాల్లో ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆదివారం కూడా గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి తమకు పైసా సాయం అందలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ములుగు జిల్లా కొండాయిలో వరదలకు నిరాశ్రయులైన వారికి 25కిలోల బియ్యంతోపాటు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు తక్షణ సాయం కింద మంత్రి సత్యవతి రాథోడ్‌ అందించారు. కానీ.. మోరంచపల్లివాసులకు మాత్రం ఇప్పటి వరకూ తక్షణ సాయం కింద ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంపై వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిపోతున్నారే గానీ, ప్రభుత్వం నుంచి సాయం మాత్రం అందలేదని స్థానికులు వాపోతున్నారు.తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మోరాంచ పల్లి వాసుల దుస్థిని చూసిన సచ్చంద సంస్థలు వారికి నిత్యావసర సరుకులతో పాటు బియ్యం, దుప్పట్లు, చాపలు, దిండ్లు తదితర సామగ్రిని అందిస్తూ భరోసా ఇస్తున్నాయి. 5 వేల నుంచి 10 వేల రూపాయల విలువ చేసే సామగ్రిని బాధితులకు అందిస్తున్నాయి. అలాగే జీఎంఆర్‌ ట్రస్టు.. గ్రామంలోని ఒక్కొక్క కుటుంబానికీ రూ.4వేల చొప్పున నగదును అందించింది. మాజీ సైనికులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆదుకోకున్నా.. ఇలా స్వచ్ఛంద సంస్థల నుంచి అందుతున్న సాయంతో బాధితులకు కొంత ఊరట కలుగుతోంది. వరద ఉధృతికి జలదిగ్బంధంలో చిక్కుకున్న మోరంచపల్లిలో ప్రజలు పుట్టెడు శోకంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
Telangana Rains: తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..