Site icon NTV Telugu

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటింటా వైద్య పరీక్షలు..

తెలంగాణ రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లా ల ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని… ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, వారికి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ రెండు జిల్లాల్లోని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటి వద్దే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తారని తెలిపారు.

బీపీ, మధుమేహం, ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలను అకడికకడే నిర్వహిస్తారని అన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరమనుకుంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సెంటర్లకు పంపి, పరీక్షలు చేయిస్తారని వివరించారు. వైద్య ఆరోగ్య రంగంలో వ్యాధుల ట్రెండ్స్, వాటి నివారణ, ఇతర కార్యక్రమాల తయారీలో ఈ ప్రాజెక్టు సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహకారం అందించేందుకు ఈ ప్రాజెక్టు సమాచారం దోహద పడుతుందని వివరించారు.

Exit mobile version