NTV Telugu Site icon

Subhash patriji: పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూత

2012 May Vizag 17 (1)

2012 May Vizag 17 (1)

ప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూశారు.ఆయన వయసు 74ఏళ్ళు.గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. బెంగళూరులో చికిత్స తీసుకుంటున్న ఆయనను రెండు రోజుల క్రితం కడ్తాల్‌ మహేశ్వర పిరమిడ్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు సుభాష్ పత్రీజీ. సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్టు సభ్యులు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పిరమిడ్‌ ధ్యాన మండలి సభ్యులు అంత్యక్రియలకు తరలి రావాలని పిరమిడ్‌ ధ్యాన్‌ ట్రస్టు సభ్యులు కోరారు. సుభాష్ పత్రిజీ నిజామాబాద్‌లోని బోధన్‌లో జన్మించారు. గతంలో కర్నూలు జిల్లాలో కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 2012లో కడ్తాల్‌ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్దదైన కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌ నిర్మించారు.

అదే ఏడాది డిసెంబర్‌ 18 నుంచి జనవరి 31 వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు. ఆ తర్వాత ఏటా ధ్యాన మహాచక్రం సంబరాలు డిసెంబర్‌ 18 నుంచి జనవరి 31 వరకు నిర్వహించి ధ్యానం విశిష్టతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియాను ఆయన గతంలో స్థాపించారు. సుభాష్ పత్రీజీ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు.

సుభాష్ పత్రీజీ మన రోజువారీ జీవితంలో మరియు ధ్యానం సమయంలో పిరమిడ్‌లను ఎలా ఉపయోగించవచ్చో వివరించారు.శ్వాసపై ధ్యాస పెడితే ఆరోగ్యం సిద్ధిస్తుందని పత్రీజీ సెలవిచ్చేవారు. ధ్యానమే సర్వరోగ నివారిణి అనేవారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు, తోటివారితో కలిసి ధ్యానం చేయడం వల్ల వారిలో కూడా శక్తులు వస్తాయని పత్రీజీ బోధించేవారు.జ్ఞాపక శక్తితో పాటు, మనశ్శాంతి, ఆయుష్షు పెరుగుతుందని బ్రహ్మర్షి పత్రీజీ తన ప్రసంగాల్లో వివరించేవారు.

Chiranjeevi: ఇక్కడ డైలాగ్స్ సెట్స్ లోనే రాస్తారు