Site icon NTV Telugu

TS University: తెలంగాణ వర్సిటీ సెలవులపై విద్యార్థులు ఆందోళన

Telangana Univercity

Telangana Univercity

TS University: తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ), పాలక మండలి (ఈసీ) మధ్య విభేదాల కారణంగా రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రగులుతుంది. వర్సిటీకి వీసీ రాకతో స్టాఫ్ రిజిస్ట్రార్ ఛాంబర్ తెరిచినా ఆ స్థానంలో ఎవరూ కూర్చోలేదు. యూనివర్సిటీకి వచ్చిన వీసీ రవీందర్‌ను ఆయన ఛాంబర్‌లో పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, బీవీఎం విద్యార్థి సంఘాల నేతలు చుట్టుముట్టారు. వీసీ, ఈసీ నియామకాల నేపథ్యంలో.. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌తో పాటు సారంగాపూర్ ఎడ్యుకేషన్, భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లకు జూన్ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వీసీ ఆచార్య రవీందర్ బుధవారం సాయంత్రం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్‌ క్యాంపస్‌తో పాటు సారంగాపూర్‌ ఎడ్యుకేషన్‌, భిక్కనూరు సౌత్‌ ప్రాంగణాలకు జూన్‌ 1 నుంచి 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి నెలకింది. విద్యార్థులు గురువారం మధ్యాహ్నం భోజనం తర్వాత వసతి గృహాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 9 వరకు తరగతులు ఆన్‌లైన్‌లో ఉంటాయని వెల్లడించారు.

వర్సిటీకి ముందుగా మే 31 వరకు వేసవి సెలవులు ఉన్నప్పటికీ, కొత్త విద్యా సంవత్సరం 2023-24 తరగతులను ముందుగానే ప్రారంభిస్తామని మే 18న ప్రకటించారు. కొందరు ఉపాధ్యాయులు విధులకు వస్తున్నా విద్యార్థులు రావడం లేదన్నారు. ఈనేపథ్యంలో ముందుగా తీసుకున్నా నిర్ణయించిన ప్రకారం జూన్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, సెలవులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. ఏవో కుంటి సాకులు చెబుతూ హాస్టల్ ఖాళీ చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలో నెలకొన్న వివాదంపై విద్యార్థుల పోరాటాన్ని విరమించుకునేందుకే వీసీ సెలవులు ప్రకటించారని PDSU, ABVP నాయకులు మండిప్డడారు. హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టాలని గతంలో విన్నవించినా అధికారులు స్పందించలేదని పీడీఎస్‌యూ నాయకులు ఒక ప్రకటనలో ఆరోపించారు. వీసీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akash Ambani : అంబానీ ఇంట వారసురాలు జననం.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్‌ దంపతులు

నిజామాబాద్‌ తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌ సీటు వివాదం ముదిరింది. ఈసీ, వీసీ నియమించిన ఇద్దరు రిజిస్ట్రార్లు ఒకేసారి యూనివర్సిటీకి రావడంతో.. గందరగోళం నెలకొంది. రిజిస్ట్రార్ ఎవరనే విషయంపై గొడవ జరగడం చర్చనీయాంశమైంది. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి సోమవారం కార్యాలయానికి వచ్చి విధుల్లో చేరారు. ఆ తర్వాత ఇటీవల వైస్ ఛాన్సలర్ నియమించిన రిజిస్ట్రార్ ప్రొ.కనకయ్య కూడా కార్యాలయానికి వచ్చి ప్రొఫెసర్ యాదగిరిని నిలదీశారు. ఉత్తర్వులు లేకుండా రిజిస్ట్రార్ సీటులో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. రిజిస్ట్రార్‌గా కొనసాగాలని వీసీ రవీందర్‌గుప్త ఉత్తర్వులు ఇచ్చారని, తానే ఆ పదవిలో ఉంటానని కనకయ్య తెలిపారు. అయితే రిజిస్ట్రార్‌గా కొనసాగాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారని ప్రొ.యాదగిరి వివరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాజీకి ప్రయత్నించారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగాయి. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు కూడా వేర్వేరు వర్గాలుగా విడిపోయి ఇద్దరు రిజిస్ట్రార్లకు అనుకూలంగా నినాదాలు చేశారు. రిజిస్ట్రార్ విషయంలో వీసీ, ఈసీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా రిజిస్ట్రార్‌గా ఉండాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు తరగతులు నిర్వహించవద్దని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. చివరకు సీనియర్ అధ్యాపకులు జోక్యం చేసుకుని రిజిస్ట్రార్, ఈసీ కార్యాలయాలకు తాళాలు వేశారు. ఇదిలా ఉండగా ఈసీ, వీసీల మధ్య జరుగుతున్న వాగ్వాదంతో ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
Akash Ambani : అంబానీ ఇంట వారసురాలు జననం.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్‌ దంపతులు

Exit mobile version