ఇంకో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలాంటి సందర్భంలో చదివినా సరే.. వారు ప్రశ్నకు సమాధానం ఇట్టే రాయగలరు.. చెప్పగలరు.. కానీ ఎక్సమ్స్ వచ్చే సరికి ఆ రెండు పనులూ చేయలేరు. ఇంకొందరు క్లాస్లో టీచర్స్ ప్రశ్నలు అడిగినప్పుడు స్పీడ్ గా ఆన్సర్స్ ఇస్తారు.. కానీ పరీక్షల అంటే మాత్రం ఎక్కడా లేని భయపడతారు. దీంతో వారు చదివిన మొత్తం విషయాలు మరిచిపోతారు. ఆ విషయాలను గుర్తుంచుకోవడానికి పిల్లలలో పరీక్షల భయాన్ని వదిలించడానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసింది. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది.
Also Read : Rashmi Gautam: కిర్రాక్ లుక్స్‌తో శారీలో మెరిసిన రష్మీ
ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియేట్ ఫైనల్ ఎక్సమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 9.15 లక్షల మంది విద్యార్థులు హాజరై.. తమ భవిష్యత్ కు బాటలు వేయాలనుకుంటున్నారు. అయితే పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ.. విద్యార్థుల్లో వారిలో వారికే తెలియని భయం, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే వారిలో భయాన్ని వదిలించడానికి టెలీ-మానస్ అనే స్పెషల్ కౌన్సిలింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ భయాన్ని పోగెట్టడానికి ఒక సైకాలజిస్ట్ ను ఏర్పాటు చేశారు.
Also Read : ARI Trailer: అరిషడ్వర్గాల నేపథ్యంలో ‘అరి’… విడుదలైన ట్రైలర్!
ఈ 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే సరిపోతుందని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పరీక్షల భయాన్ని తొలగించి.. వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్ కు కాల్ చేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ నెంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఎక్కువగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల నుంచే కాల్స్ వస్తున్నాయని ఓకౌన్సిలర్ వివరించారు. ఇంటర్లో మంచి ర్యాంక్ వస్తే కానీ.. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్, ఎంసెట్,నీట్లలో అర్హత సాధించలేమని విద్యార్థులు అనుకుంటున్నారని కౌన్సిలర్ వెల్లడించారు. అందుకే విద్యార్థుల్లో ఎక్కువ ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లో ఒత్తిడిలో ఉన్నారని వారు తెలిపారు.
Also Read : Bombay High Court: కార్ టైర్ పేలడం “యాక్ట్ ఆఫ్ గాడ్” కాదు.. ఇన్సూరెన్స్ చెల్లించాల్సిందే..
టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ అని అంటారు. అంటే ఫోన్లోనే అవతలి వ్యక్తికి కౌన్సెలింగ్ ఇస్తారని అర్థం. ఇందుకు 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది. ఈ హెల్ప్ లైన్ ను దేశంలో కరోనా పెరిగిపోయిన భయాలతో, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారి గురించి.. 2022-23 బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన 2022 అక్టోబర్ 10న ప్రపంచ మానసిక దినోత్సవం రోజు ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది పని చేస్తుంది. హైదరాబాద్ లో వెంగళ్రావు నగర్ లో ఈ విభాగం పని చేస్తుంది.
