NTV Telugu Site icon

Nizamabad College: మరో మెడికో విద్యార్థి ఆత్మహత్య.. హాస్టల్‌ రూంలోనే ఉరివేసుకుని

Nizam Medical College

Nizam Medical College

Nizamabad College: కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నిజామాబాద్‌ లోని ఓ మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష తన రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రీతి ఘటనపై అసలు ఏం జరుగుతోంది అనే ఒక కేసును ఛేదించే పనిలో వున్న పోలీసులకు మోడికో విద్యార్థి దాసరి హర్ష ఆత్మహత్య పోలీసులకు సవాల్‌ గా మారింది.

Read also: Nalgonda love Story: ప్రేమదేశం సినిమా రిపీట్‌.. విషాదంగా క్లైమాక్స్‌

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ లో మేడికో ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే అసలు ఏం జరిగిందో తెలియదు కానీ హర్ష తన రూం ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో షాక్‌ తిన్న విద్యార్థులు యాజమాన్యానికి సమచారం అందించారు. యాజమాన్యం ఈఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా గుర్తించారు. అయితే తన కన్న కొడుకు ఆత్మహత్యపై హర్ష కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. హర్ష అంత పిరికివాడు కాదని తన కొడుకు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపాలు. అసలు కాలేజీ ఏం జరిగింది. హాస్టల్లో ఏమైనా గొడవ జరిగిందా లేక ఇంకా ఏమైనా కారణాలు వున్నాయా? అనే రీతిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read also: Khammam market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత.. మిర్చి అమ్మకానికి అడ్డుకోవడంతో దాడి

అయితే కాకతీయ మెడికల్ కాలేజ్‌లో పీజీ ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక.. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. దీంతో.. సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఇక శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు. ఇక మరోవైపు ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. మెడికో ప్రీతికి ఎక్మో ద్వారా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు.
Complaints to GHMC: కుక్కలు బాబోయ్‌ కుక్కలు.. జీహెచ్‌ఎంసీకి 36 గంటల్లో 15వేల కంప్లైంట్స్‌