NTV Telugu Site icon

Student Suside: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య.. బాత్రూంలో చున్నీతో ఉరేసుకుని సూసైడ్..!

Nzb

Nzb

Student Suside: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పీయూసి ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపికగా గుర్తించారు. మృతురాలు స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్. అప్పటి దాకా విద్యార్థులతో కలిసి వార్షిక పరీక్షలు రాసింది. అనంతరం బాత్రూంకి వెళ్లాస్తానంటూ వెళ్లి.. ఎంతకీ రాకపోవడంతో అక్కడున్న భద్రతా సిబ్బందికి అనుమానమచ్చింది. వెంటనే వారు వెళ్లి చూసేసరికి చున్నీతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Read Also: Unfriendliest Cities: “అన్ ఫ్రెండ్లీ” నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ..

విద్యార్థిని అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి క్యాంపస్ హెల్త్ సెంటర్ లో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అయితే అక్కడికి తీసుకెళ్లిన సిబ్బంది.. విద్యార్థిని మృతి చెందినట్లు భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు ధ్రువీకరించారు. అయితే విద్యార్థిని దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది తదితరులు చింతిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Chikungunya Vaccine: చికున్‌గున్యాకు వ్యాక్సిన్ రాబోతోంది.. ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు..

ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని దీపిక ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు విద్యార్థిని సూసైడ్ పట్ల తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అయితే విద్యార్థిని సూసైడ్ పై గల కారణాలు తెలియాల్సి ఉంది.