Site icon NTV Telugu

Kadiyam Srihari: ‘మీరొస్తేనే ఓటు.. వేరే వాళ్లకి వేయమని చెప్పొద్దు’

Kadiyam Srihari

Kadiyam Srihari

Station Ghanpur Constitution People Strange Demand To Kadiya Srihari: ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఓ అనూహ్యమైన ఘటన ఏర్పడింది. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జాఫర్గడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో మరణించిన గుండెకుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లగా.. గ్రామ ప్రజలు ఆయన ముందు ఓ వినూత్నమైన అభ్యర్థన పెట్టారు. ‘మీరు నిలబడతా అంటేనే గ్రామానికి రండి, అలా కాకుండా వేరేవాళ్లకి ఓట్లు వేయమని అడిగితే ఈ రోడ్డు తొక్కకండి’ అంటూ షరతు పెట్టారు.

తమ గ్రామంలో అభివృద్ధి పనులు చేసింది మీరు మాత్రమేనని, ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆ గ్రామ ప్రజలు కడియం శ్రీహరి ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు ఇక్కడ ఉంటా అంటేనే రావాలి’ అని గ్రామస్తులు దండం పెట్టి వేడుకుంటున్నారు. వేరే వాళ్లకి మాత్రం తాము ఓటు వేయమని తేల్చి చెప్తున్నారు. ఈ విధంగా కడియం శ్రీహరిని వేడుకుంటున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను గెలిపించాలని, కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ తనని చూసి రాజయ్యకు ఓటేయాలని కడియం శ్రీహరి ప్రచారం చేసిన సంగతి విదితమే!

Exit mobile version