Farmers Festival: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా నేటి నుంచి మూడు రోజుల పాటు రైతు పండగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రైతు సదస్సులో భాగంగా 25 వివిధ విభాగాల ఆధ్వర్యంలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
Read also: Nagababu Rajyasabha: రాజ్యసభకు నాగబాబుకు.. లైన్ క్లియర్ చేస్తున్న పవన్ కళ్యాణ్?
సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే రైతుబంధు పండుగను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ప్రారంభించనున్నారు. నేడు జరిగే సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేడు, రేపు జరిగే సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది రైతులు తరలిరానున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు మరియు వివిధ పంట ఉత్పత్తుల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొంటారన్నారు.
Read also: 2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరలించే ఛాన్స్..?
ప్రజాపాలన విజయోత్సవం, రైతు పండగపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకుంటోందన్నారు. మిగిలిన రైతు రుణమాఫీపై 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటన చేస్తారని తెలిపారు. రైతుబంధు ఉత్సవాలకు వేలాది మంది రైతులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పంటలను ప్రదర్శించడానికి స్టాళ్లు, వచ్చే వాహనాలకు పార్కింగ్, తాగునీరు. తాత్కాలిక మరుగుదొడ్లు, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు సిద్ధం చేశారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సీసీ కెమెరాల నిఘాలో రైతు పండగ కొనసాగనుంది.
Tiruchanoor: కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుచానూరు..