Site icon NTV Telugu

TS SSC Exams: టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. మే 23 నుంచి..

జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ మార్చిన ఇంటర్‌ బోర్డు.. తాజాగా కొత్త తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. ఇదే సమయంలో రాష్ట్రంలో జరగనున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేష‌న్… తెలంగాణలో మే 23వ తేదీ నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ పరీక్ష ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది..

Read Also: TS Inter Exams: మారిన ఇంటర్‌ పరీక్షల తేదీలు.. కొత్త షెడ్యూల్‌ ఇదిగో..

ఇక టెన్త్‌ 2022 పరీక్షల తేదీల విషయానికి వస్తే.. మే 23వ తేదీన ఫ‌స్ట్ లాంగ్వేజ్, 24న సెకండ్ లాంగ్వేజ్, 25వ తేదీన థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌), 26న గ‌ణితం, 27న భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, 28న సాంఘిక శాస్త్రం, 30న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1, 31న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2, ఇక, జూన్‌ 1వ తేదీన ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ) పరీక్షలు నిర్వహించనున్నారు.. అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుండగా.. జూన్‌ 1వ తేదీన ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ) పరీక్ష మాత్రం ఉద‌యం 9.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

Exit mobile version